: ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని కూడా పనిచేయనివ్వం: నరేంద్రరావు
ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేయనివ్వమని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు హెచ్చరించారు. విభజన కోసం అధికారులు తయారుచేసిన సచివాలయ ఉద్యోగుల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని ఆయన మండిపడ్డారు. నిజమైన తెలంగాణ ఉద్యోగులెవరో తామే ప్రకటిస్తామన్నారు. తెలంగాణ, సీమాంధ్ర జాబితాను తాము తయారుచేస్తామని నరేంద్రరావు అన్నారు. తాము తయారుచేసిన జాబితాలో ఉన్న ఉద్యోగులు మాత్రమే తెలంగాణ సచివాలయంలో పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.