: రెండ్రోజుల పాటు పెరగనున్న కరెంట్ కష్టాలు
వరంగల్ జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ వల్ల ఈ అవాంతరం ఏర్పడింది. దీనిని సరిచేయడానికి రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇది మరికొంత ఇబ్బందికరమే.