: దక్షిణ మధ్య రైల్వేలో తొలి హెల్ప్ డెస్క్ ప్రారంభం
ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాదు స్టేషన్ లో తొలి హెల్ప్ డెస్క్ ను ప్రారంభించింది. ఈ హెల్ప్ డెస్క్ ను దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ ప్రారంభించారు. రైళ్ల రాకపోకలు, రైల్వే స్టేషన్ లో విద్యుత్ సమస్యలు, అత్యవసర వైద్యం, చోరీలపై ఫిర్యాదుల కోసం ఈ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు.