: విశాఖ సీపీ శివధర్ రెడ్డి బదిలీ
అపాయింటెడ్ డే దగ్గర పడటంతో పోలీస్ శాఖలో అధికారుల విభజన ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం విశాఖ సీపీ శివధర్ రెడ్డి బదిలీ అయ్యారు. హైదరాబాదులోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని శివధర్ రెడ్డికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. శివధర్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐపీఎస్ అధికారి.