: వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న కొత్త పెళ్లికొడుకు ఎన్డీ తివారీ
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ లేటు వయసులో కొత్త పెళ్లికొడుకుగా మారి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న ఉజ్వల శర్మతో జరిగిన వివాహాన్ని ఆయన రిజిస్టర్ చేయించారు. ఉజ్వల కుమారుడిని తన కొడుకుగా అంగీకరించని ఆయన... చివరకు కోర్టు తీర్పుతో కుమారుడిగా అంగీకరించాల్సి వచ్చింది. దీంతో, ఉజ్వలను ఆయన వివాహం చేసుకుని దానికి చట్టబద్ధత కల్పించారు.