: మొదలైన బాద్ షా సందడి
భారీ అంచనాలతో, భారీ బడ్జెట్ తో రూపొందించిన బాద్ షా చిత్రం ఈ రోజు విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి థియేటర్లకు పైగా చిత్రం విడుదలైనట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు థియేటర్ల దగ్గర బారులు తీరారు. రాజధానిలోని థియేటర్లలో ఈ చిత్రానికి సంబంధించిన టికెట్లు మూడు రోజుల వరకూ ముందుగానే అమ్ముడయ్యాయి.