: మూడు గంటల పాటు సాగిన సీడబ్ల్యూసీలో అంతర్మథనం
న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై వాడివేడి చర్చ జరిగింది. సుమారు మూడు గంటల పాటు కాంగ్రెస్ పార్టీ అంతర్మథనం సాగింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసేందుకు సిద్దమవగా, రాజీనామాల ప్రస్తావన లేకుండా ఈ సమావేశం ముగిసింది.