: కుప్పంలో భారీ విజయోత్సవ ర్యాలీ


టీడీపీ అధినేత చంద్రబాబు విజయం సాధించిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ నేతాజీ సెంటర్ మీదుగా కుప్పం ప్రధాన వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మునిరత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, పార్టీ నేతలు నాగరాజు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News