: అభివృద్ధి కోసం టీఆర్ఎస్ కు సహకరిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ
దేశంలోనే తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు టీఆర్ఎస్ కు సహకరిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ తో కలసి పనిచేస్తామని తెలిపారు. త్వరలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. తమకు మంత్రి పదవులు అవసరం లేదని... అభివృద్ధే ముఖ్యమని అసద్ తెలిపారు. తెలంగాణలో సెక్యులరిజాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.