: ఎముకలు పెరగడానికి నానో కిక్కింగ్
మానవుడి ఎముకలో ఉండే స్టెం సెల్స్ (మూలకణాలు) కు కృత్రిమ కంపనం కలిగించడం ద్వారా.. కొత్త ఎముక పెరిగే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎముకల చికిత్స విధానంలో ఈ సరికొత్త పరిశోధన లండన్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ప్రయోగశాలలో కొన్ని రసాయనాల మిశ్రమం ద్వారా ఎముక పెరిగేలా చేస్తున్నారు. అయితే అదనపు రసాయనాల అవసరం బయటినుంచి ఇవ్వకుండానే.. ఎముక పెరిగే సాంకేతికత ఇది. ఈ పద్ధతిలో స్టెం సెల్స్ సెకనుకు వెయ్యి రెట్లు అభివృద్ధి చెంది కొత్త ఎముకగా అవతరిస్తుందని గ్లాస్గౌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఎముక పెరుగుదల చికిత్సకు ప్రస్తుతం ఉన్న పద్ధతి కంటె ఇది చాలా చవక అటకూడా! ఈవిధానం ద్వారా ఎముక మూలుగలోని పెద్ద మూలకణాలను, ఎముక తయారుచేసే కణాలుగా మార్చడం కూడా కుదురుతుందిట.