: డార్క్ మ్యాటర్‌ రహస్యం తెలుస్తుందేమో ఇక!


మామూలు టెలిస్కోప్‌ ద్వారా సాధ్యం కాదేమో కానీ, అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌ కు అమర్చిన టెలిస్కోపులో ఇప్పటిదాకా ఖగోళ శాస్త్రవేత్తలకు చిక్కుముడిగానే ఉన్న డార్క్‌మ్యాటర్‌ ఆనవాళ్లు చిక్కుతాయని తెలుస్తోంది. మన చుట్టూ ఉండే విశ్వంలో ఉండే దాదాపు 80 శాతం పదార్థం.. ఈ డార్క్‌మాట్యర్‌ (కృష్ణపదార్థం) నుంచే తయారయిందని  శాస్త్రవేత్తల  అంచనా. అయితే ఆ డార్క్‌ మ్యాటర్‌ గురించి మాత్రం ఇప్పటికీ పరిశోధనలు ఏమీ చెప్పలేకపోయాయి. 

2011 మేలో అల్ఫా మేగ్నటిక్‌ స్పెక్ట్రోమీటర్‌ పరికరాన్ని అమెరికా పరిశోధకులు అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్‌కు పంపారు. దాని ద్వారా కొత్త పరిశోధనలు జరిగాయి. ఒకదానితో ఒకటి ఢీకొనే డార్క్‌మ్యాటర్‌ అణువులకు సంబంధించి.. మొట్టమొదటి స్పష్టమైన ఆనవాళ్లను చూపేలా.. ఈ ఏఎంఎస్‌ ప్రయోగం.. కొన్ని కోట్ల కణాలను గుర్తించింది. ఈ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న నోబెల్‌ గ్రహీత శామ్యూల్‌ టింగ్‌ మాట్లాడుతూ.. ఈ ఆవిష్కరణ డార్క్‌మ్యాటర్‌కు ఓ ప్రతీక మాత్రమేనని.. పూర్తి ఆధారం కాదని .. ఇంకా అనేక విడతలుగా ప్రయోగాలు జరగాల్సి ఉన్నదని పేర్కొనడం విశేషం. 

  • Loading...

More Telugu News