: హెచ్‌ఐవీ నివారణ విషయంలో శుభవార్త


ఇప్పటివరకు వ్యాధులకు సంబంధించి ముందస్తు నివారణకు తీసుకునే జాగ్రత్తగా ఉపయోగపడే టీకా అంటూ లేనివ్యాధి హెచ్‌ఐవీ. మనిషిలో రోగనిరోధక శక్తిని హరించేస్తూ చావుకు దగ్గరచేసే హెచ్‌ఐవీ నిరోధానికి టీకా రూపకల్పన విషయంలో శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేశారు. మానవాళి తొలినాళ్లలో వారిలో ఉండే రోగనిరోధకశక్తి తీరుతెన్నులను శాస్త్రవేత్తలు గుర్తించారు.

దానిని ప్రాణాంతక హెచ్‌ఐవీకి టీకాగా రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. తొలినాళ్లలో హెచ్‌ఐవీ బారిన పడిన వ్యక్తుల్లో వైరస్‌ పరిణామక్రమాన్ని జాన్‌ మస్కోలా నేతృత్వంలోని వైద్యులు విశ్లేషించి.. యాంటీబాడీల ప్రతిస్పందనను ప్రేరేపించడం ద్వారా టీకాలు పనిచేసేలా చూస్తున్నారు. అయితే ఇప్పటికీ వ్యాధి గ్రస్తులకు ఇది శాశ్వత ఉపశమనం అవుతుందా? లేదా? అనే విషయంలో మాత్రం సందేహాలు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. 

  • Loading...

More Telugu News