: ఒవైసీ సోదరులతో భేటీ కానున్న టీఆర్ఎస్ నేతలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీలతో టీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు. కేటీఆర్, ఈటెల రాజేందర్, నాయిని నరసింహారెడ్డి, పద్మారావులు ఈ మధ్యాహ్నం ఒవైసీ సోదరులను కలుస్తారు. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరనున్నారు.