: ప్రతిపక్ష నేతగా కూడా జగన్ పనికిరాడు: జేసీ
ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న వైకాపా అధినేత జగన్ ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ చేసిన ఆర్థిక నేరాలకు శిక్ష పడితీరుతుందని... ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. ఈ రోజు ఆయన శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఏనాటికైనా కాంగ్రెస్ లో కలుస్తుందని చెప్పారు. సీమాంధ్ర రాజధాని ఎక్కడ అనేది చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.