: నీ శ్వాసలో చేరెనే... సకల రోగాల చిహ్నాలూ...


...అంటూ వైద్యశాస్త్రం ఇప్పుడు కొత్త పాట అందుకుంటోంది. మీరు నెత్తురు చిందిస్తే తప్ప.. అదేనండీ.. పరీక్షల నిమిత్తం ఒక నెత్తురు బొట్టును సమర్పించుకుంటే తప్ప సాధ్యం కాని అనేకానేక వైద్య పరీక్షలు ఇప్పుడు కేవలం మీ శ్వాసను పరీక్షించడం ద్వారానే తేలిపోతాయిట. ముక్కుద్వారా బయటకు వదిలే గాలిని పరీక్షించడం అనేది.. కొన్ని రకాల వ్యాధుల నిర్ధరణకు రక్త, మూత్ర పరీక్షలకు ప్రత్యామ్నాయం కాగలదని జ్యూరిచ్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ డాక్టర్లు నిగ్గు తేల్చారు. శ్వాస వదిలే గాలిని బట్టి ఆరోగ్య పరిస్థితిని అంచనావేసే పరికరాన్ని వారు రూపొందించారు. వదిలే గాలిలోని రసాయనాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటాయని, దాన్ని పరీక్షించడం వల్ల శరీరంలోని రోగాల ఆచూకీ తెలుస్తుందని అంటున్నారు. 

  • Loading...

More Telugu News