: భూగ్రహాన్ని పోలిన సోదరగ్రహాలు పదివేల కోట్లు


పరిమాణం పరంగా చూస్తే భూగ్రహానికి దగ్గరగా ఉండే, అదే విధంగా ఉండే గ్రహాలు ఈ విశ్వంలో పదివేల కోట్ల వరకు ఉంటాయిట. ఇప్పటిదాకా భూమితో సమానంగా ఉండే గ్రహాలు 1700 కోట్లు మాత్రమే ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. కెప్లర్‌ టెలిస్కోప్‌ పరిశోధనల ఆధారంగా ఆ అంకె నిగ్గుతేలింది. అయితే.. గ్రావిటేషనల్‌ మైక్రోలెన్సింగ్‌ అనే కొత్త పద్ధతి ద్వారా.. రోదసిన అన్వేషించినప్పుడు.. ఇతర గ్రహాలు కూడా కనిపిస్తాయిట.

ఆ పద్ధతిలో చూసినప్పుడు.. భూమికి సమానమైన గ్రహాలు పదివేల కోట్ల వరకు కనిపిస్తాయని న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. నాసావారి కెప్లర్‌ టెలిస్కోపింగ్‌కు, మైక్రో లెన్సింగ్‌ సాంకేతికతను కలపడం ద్వారానే ఈ గ్రావిటేషనల్‌ మైక్రోలెన్సింగ్‌ను అభివృద్ధి చేశారట. మొత్తానికి మన గ్రహానికి సోదర గ్రహాలు పదివేల కోట్లు అంటే.. ఇన్నాళ్లూ రోదసి, విశ్వం, పాలపుంత అనే పదాలకు మన మదిలో ఉండే ‘విశాలమైన’ ఇమేజి.. ఇప్పుడు వందలరెట్లుగా పెరిగిపోతుంది కదా!

  • Loading...

More Telugu News