: నరేంద్ర మోడీకి బంగ్లాదేశ్ ప్రధాని అభినందనలు
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్ర మోడీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఫోన్ లో అభినందనలు తెలిపారు. మోడీ సారధ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటాయన్న ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు. ఈ నెల 16న ఫలితాలు వెలువడిన రోజే మోడీకి రాసిన లేఖలో ఆయన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భారత ప్రధానిగా తొలి అధికారిక పర్యటన బంగ్లాదేశ్ కావాలని అభిలషించారు.