: ఢిల్లీలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కేజ్రీవాల్ పై ఒత్తిడి


ఢిల్లీలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధినాయకత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సూచించారు. నిన్న కేజ్రీవాల్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇందులో 20 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాంగ్రెస్ లేదా, బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పలువురు సూచించారు. కేవలం 49 రోజుల పాలన అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో కేజ్రీవాల్ ఢిల్లీలో అధికారం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో చేదు ఫలితాలకు ఇదే కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ ఒక్క పంజాబ్ లో నాలుగు స్థానాలు మినహా మరెక్కడా గెలవలేకపోయింది. పార్టీ ఎమ్మెల్యేల సూచనలను కేజ్రీవాల్ విని ఊరుకున్నట్లు సమాచారం. నిర్ణయాన్ని పార్టీ రాజకీయ కమిటీకి అప్పగించినట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News