: బౌలర్ చేయి వికెట్లను తాకితే ఇక నోబాలే
క్రికెట్లో మరో కొత్త నిబంధన పురుడు పోసుకుంది. బౌలింగ్ చేస్తున్న సమయంలో బౌలర్ చేయి నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న వికెట్లను తాకితే అంపైర్ దాన్ని ఇక నుంచి నోబాల్ గా ప్రకటించవచ్చు. ఈ నిబంధన టెస్టులు, వన్డేలు, టి20లకు వర్తిస్తుందని ఐసీసీ నేడు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త రూలు ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి వస్తుందని ఐసీసీ పేర్కొంది. ఇప్పటివరకు బౌలర్ చేయి వికెట్లను తాకితే దాన్ని డెడ్ బాల్ గా పరిగణించేవారు.