: గుంటూరు నుంచి చంద్రబాబు పాలన
కొత్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు పట్టణం నుంచి పాలన సాగించనున్నారు. జూన్ 2 నుంచి రాష్ట్రం రెండుగా విడిపోవడం తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. రెండు ప్రభుత్వాలు హైదరాబాద్ లోనే కొలువుదీరతాయి. అన్ని పాలనా కేంద్రాలు ఇక్కడే ఉంటాయి. అయితే, వారంలో మూడు రోజుల పాటు గుంటూరు నుంచే పాలన నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తద్వారా అక్కడి ప్రజలకు సమీపంలోనే పాలన ఉన్నట్లు అవుతుందని ఆయన ఆలోచన.