: విజయవాడలో చంద్రబాబు ప్రమాణస్వీకారం
విభజనానంతరం నూతన ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరుపతిలో చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఒక పక్కగా ఉండడంతో... అక్కడ కంటే సీమాంధ్ర నడిబొడ్డు అయిన విజయవాడలో ప్రమాణం చేస్తే బాగుంటుందని పార్టీ నేతలు సూచించారు. దీంతో విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.