: జగన్ ఓడిపోయినందుకు మొక్కు తీర్చుకున్న డీఎల్
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం ఆయన తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ దేశాన్ని పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని మండిపడ్డారు. ఆ తల్లి కాంగ్రెస్ నుంచి పుట్టిందే పిల్ల కాంగ్రెస్ వైఎస్సార్ కాంగ్రెస్ అన్నారు. అవినీతిపరుడైన జగన్ అధికారంలోకి రాకూడదని నిష్ఠతో కోరుకున్నానని, అది తీరడంతో మొక్కు తీర్చుకున్నానని తెలిపారు. విశాఖలో విజయమ్మ గెలిస్తే సముద్రం కూడా మిగిలేది కాదన్నారు.