: లోక్ సభకు ఎన్నికైన వారిలో... 75 శాతం ఎంపీలు మాత్రమే పట్టభద్రులు!
లోక్ సభకు ఎన్నికైన అభ్యర్థుల్లో 75 శాతం మంది ఎంపీలు మాత్రమే పట్టభద్రులు. ఇది 15వ లోక్ సభతో పోల్చుకుంటే దాదాపు నాలుగు శాతం తక్కువగానే కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఎన్నికైన వారిలో 10 శాతం మంది 10వ తరగతి వరకు చదివిన వారు ఉండగా, అసలు ఆ మాత్రం కూడా చదవనివారు 13 శాతం మంది ఎంపీలు ఉన్నారు. అయితే, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న ఎంపీల సంఖ్య మాత్రం ఈసారి ఎక్కువగానే ఉంది. డాక్టరేట్ హోదా కల్గిన వారు 3 నుంచి 6 శాతానికి పెరిగారు. వీరంతా మరికొద్దిరోజుల్లో 16వ లోక్ సభలో అడుగుపెడుతున్నారు.