: ఖమ్మంలో ఆ ఇద్దరూ కలిసి టీడీపీని ముంచేశారు!
ఖమ్మం జిల్లాలో వర్గపోరు టీడీపీ కొంప ముంచింది. అక్కడ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు నువ్వా-నేనా అన్న రీతిలో వ్యవహరించడంతో అక్కడ తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. నామా, తుమ్మల ఒకరికొకరు సహకరించుకోకపోవడం వల్లనే ఓటమి పాలయ్యామని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. కలిసి పనిచేస్తే ఖమ్మం ఎంపీ సీటును గెలుచుకొనేవాళ్లమని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఖమ్మం పట్టణంలో టీడీపీ అభిమాని పేరిట ఓ ఫ్లెక్సీ వెలిసింది. వర్గ పోరును మరిచి, పరస్పర సహకారంతో అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దామంటూ ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. మరి, ఇకనైనా ఆ ఇద్దరు నేతలు కలిసి ఖమ్మం జిల్లాలో పార్టీని ఏ మేరకు ముందుకు తీసుకెళ్తారో? లేదో? వేచి చూడాలి మరి!