: గెలవకపోయినా... మూడో స్థానంలో ఉన్నాం: మాయావతి
సార్వత్రిక ఎన్నికలు బీఎస్పీ అధినేత్రి మాయావతికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేక పోయింది. అయినప్పటికీ మాయావతి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, సీట్లు గెలుచుకోకపోతేనేం... ఓట్లు సాధించడంలో మూడో స్థానంలో నిలిచామని చెబుతున్నారు. బీఎస్పీకి 19.6 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. మాయావతి చెప్పిన మరో విషయం ఏమిటో తెలుసా?... యూపీలో బీజేపీని 58 శాతం మంది ఓటర్లు తిరస్కరించారట.