: వీళ్లంతా హ్యాట్రిక్ విజయాన్ని ఎప్పుడో దాటేశారు!


ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధిస్తున్న ఆ నేతలు హ్యాట్రిక్ ను ఎప్పుడో దాటేశారు. ఒక్కొక్కరూ మూడు సార్లు, అంతకంటే ఎక్కువగానే విజయాలను సాధిస్తూ రికార్డులు బద్దలుకొట్టారు. నల్గొండ జిల్లాలోని అలాంటి ముగ్గురు నేతల ముచ్చటే ఇది.

నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇప్పటివరకూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ జాబితాలో ముందున్నారు. 1983, 85 ఎన్నికల్లో టీడీపీ నుంచి రెండు సార్లు గెలిచిన జానా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీ నుంచి 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి జానారెడ్డి తన సత్తా చాటారు.

ఇక, మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన నల్గొండ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999, 2004, 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి రికార్డు బద్దలుకొట్టారు.

  • Loading...

More Telugu News