: తన భార్య బంగారం అంటోన్న బాలీవుడ్ బాద్షా


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తన భార్య గౌరీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు. తన పురోగతి వెనుక భార్య త్యాగనిరతి దాగి ఉందని చెబుతున్నాడు. చిన్నపనికి కూడా భారీ ప్రచారం పొందాలనుకునే నేటి రోజుల్లో గౌరీ నిస్వార్థంగా తనకు సేవలు చేస్తోందని షారూఖ్ ప్రశంసల జల్లు కురిపించాడు.

'నాతో వ్యవహరించడం చాలా కష్టం. ఎందుకంటే, నాలో అన్నిరకాల గుణాలు కలగలసి ఉంటాయని భావిస్తాను. ఓ నటుడికి ఉండాల్సిన అతి సున్నితత్వం, స్వీయ విమర్శనాత్మక గుణం.. ఇలా అన్నీ ఉన్నాయి. ఇక పిల్లలతో గడపలేకపోతున్నానన్న భావన ఎప్పుడూ కలగలేదు. ఈ ఘనత గౌరీకే చెందుతుంది' అని చెప్పుకొచ్చాడు.

ఇటీవలే షారూఖ్-గౌరీ 'హెల్లో' అనే మ్యాగజైన్ కవర్ పేజీపై రొమాంటిక్ పోజిచ్చారు. ఓ పత్రిక ముఖచిత్రానికి జంటగా పోజులిచ్చిన తొలి బాలీవుడ్ దంపతులు వీరిద్దరే కావడం విశేషం. ఈ సందర్భంగా పలకరించిన మీడియాతో ఈ కపుల్ ముచ్చటించింది. తన భార్య బంగారం అని  షారూఖ్ ఆకాశానికెత్తేయగా.. 'ఎవరినైనా సంతోషంగా ఉంచడంలో షారూఖ్ ది అందెవేసిన చేయి, అలాగే నన్ను కూడా..' అని చెప్పి తన పతిభక్తిని చాటుకుంది గౌరీ. 

  • Loading...

More Telugu News