: ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను తరిమి తరిమి కొట్టారు
కాంగ్రెస్ ముక్త్ భారత్... ఇదే మోడీ నినాదం. ఎన్నికల ప్రచారంలో... కాంగ్రెస్ పాలన నుంచి భారత్ కు విముక్తి కల్పించండని మోడీ పదేపదే కోరారు. మోడీ పిలుపుకు ఓటర్లు స్పందించారేమో... ఏకంగా ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని తరిమి తరిమి కొట్టారు. ఢిల్లీ, గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లలో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. భవిష్యత్తులో కూడా ఎప్పుడు కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.