: భారత్ మాతాకీ జై... ఈ రోజు ఎలా ఉంది?: మోడీ
బారత దేశం మొత్తం తనపై అభిమానం కురిపించిందని భారత కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వడోదరలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని, ఆ విశ్వాసాన్ని నిజం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉన్నందున, నియోజకవర్గంలో తాను కేవలం 15 నిమిషాలు మాత్రమే గడపగలిగానని, అయినా ఐదు లక్షల ఓట్లతో ప్రేమను కురిపించారని ఆయన తెలిపారు. అది తన గుండెల్లో నిరంతరం ఉంటుందని మోడీ తెలిపారు.
భారత ప్రజాస్వామ్యంలో తనలాంటి వ్యక్తికి ప్రధాని అయ్యే భాగ్యం కలిగిందని, అదే భారత దేశం గొప్పదనమని ఆయన అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఐదు లక్షల ఓట్ల మెజారిటీ ఎవరికీ దక్కలేదని, ఆ రికార్డు నెలకొల్పి తన పేరు చరితార్థం చేశారని ఆయన అన్నారు. ఈ రోజు ఎలా గడిచింది? అంటూ తన మద్దతుదారులను ఆయన ప్రశ్నించారు. చాలా ఉద్విగ్నంగా గడిచిందని ఆయనే సమాధానం చెప్పారు.