: రేణుకా చౌదరి ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు, చీపురుకట్లతో దాడి
తెలంగాణ బలిదానాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి ఇంటిపై తెలంగాణ మహిళా విభాగం దాడికి దిగింది. హైదరాబాదు, బంజారాహిల్స్ లోని రేణుక ఇంటిపై నేతలు, కార్యకర్తలు.. కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు, చీపురుకట్టలు విసిరి ఆందోళనకు దిగారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారిని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.