: మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం : చంద్రబాబు
రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. లేదంటే రాష్ట్రం అధోగతి పాలయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్షల కోట్లు అక్రమార్జన చేసి పిల్ల కాంగ్రెస్ పెట్టారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ దోచుకునేందుకు జైలు నుంచి కుటిల యత్నాలు సాగిస్తున్నారని చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పాదయాత్రలో విమర్శించారు.