: నా 150వ సినిమా పర్యాటకరంగానికి ఊతమిస్తుంది: చిరంజీవి


తాను 150 వ సినిమా చేస్తే అది పర్యాటక రంగానికి దోహదపడేలా ఉంటుందని టాలీవుడ్ నటుడు.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. ఇటీవల అస్కార్ అవార్డు అందుకున్న `లైఫ్ ఆఫ్ పై` తననెంతో ప్రభావితం చేసిందని చిరు పేర్కొన్నారు. ఈనెల 11నుంచి 14 వరకూ హైదరాబాద్ లో ప్రపంచ పర్యాటక సదస్సు నిర్వహిస్తామని చిరు వెల్లడించారు. 

ఇదిలా ఉంచితే, ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ ఘటన దేశ పర్యాటక రంగానికి ఓ కుదుపులాంటిదని చిరంజీవి అంగీకరించారు. ఇటీవల కాలంలో విదేశీ పర్యాటకుల మీద జరుగుతోన్న దాడులపై ఆయన స్పందించారు. కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినప్పటికీ, భారత దేశానికి వస్తోన్న విదేశీ పర్యాటకుల తాకిడి ఏమాత్రం తగ్గలేదన్నారు.

దేశంలో పర్యాటక రంగాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విదేశీ పర్యాటకుల రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చిరు ఢిల్లీలో పర్యాటకరంగ సదస్సులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News