: రాళ్లబండి కవితా ప్రసాదుకు ఫైన్ పడింది
సాంస్కృతిక శాఖ సంచాలకుడు రాళ్లబండి కవితా ప్రసాదుకు రూ. 25 వేల ఫైన్ పడింది. సమాచార హక్కుకు సంబంధించిన దరఖాస్తుకు సరైన సమాచారం ఇవ్వలేదని ఆయనపై సహ కమిషనర్ విజయబాబు జరిమానా విధించారు. అంతేకాదు, రాళ్లబండిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఆయన ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సాంస్కృతిక శాఖ విడుదల చేసిన నిధులకు లెక్కలు సరిగా లేవని విజయ్ బాబు చెప్పారు.