: ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ మృతి
ప్రముఖ రచయిత్రి, మహిళాభ్యుదయవాది మల్లాది సుబ్బమ్మ మృతి చెందారు. 1924 ఆగస్టు 2న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతాలపల్లెలో జన్మించిన సుబ్బమ్మ, "కేవలం పిల్లల్ని కంటూ, ఇంటి పనులు చేసుకొంటూ, అత్తమామల అదుపాజ్ఞలలో జీవించడమే నా కర్తవ్యమా?" అని ప్రశ్నించిన ధీశాలి. ఎంవీ రామమూర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు.
మల్లాది సుబ్బమ్మ మహిళాభ్యుదయం కోసం పరితపించారు. ప్రముఖ స్త్రీవాదిగా మహిళలకోసం అనేక పోరాటాలు చేశారు. కుల నిర్మూలనపై రాజీలేని పోరాటం చేశారు, ఛాందసవాద వ్యతిరేక పోరాటం చేశారు, సమాజంలో పేరుకుపోయిన మూఢవిశ్వాస నిర్మూలన, కుటుంబ నియంత్రణపై విస్తృత ప్రచారం చేసి, స్త్రీ విద్యకోసం కృషి చేశారు. సమాజంలో మార్పు కోసం పరితపించిన మల్లాది సుబ్బమ్మ మాతృత్వానికి మరోముడి. కాంతి కిరణాలు, చీకటి వెలుగులు, ఈదేశం నాదేనా?, వంశాంకురం, వెలిగిన జ్యోతి వంటి ఎన్నో రచనలు చేశారు.