: ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి... మీడియాకు ప్రత్యేక ఏర్పాట్లు


సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. హైదరాబాదులో ఎన్నికల అధికారులు మాట్లాడుతూ, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి 15 సెకెన్లకు ఫలితాలు తెలిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. మీడియా ప్రతినిధులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించామని, వారు కౌంటింగ్ బూత్ ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. రేపు సాయంత్రానికి ఫలితాలను పూర్తిగా వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News