: కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు: సీపీ అనురాగ్ శర్మ
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు రేపు (శుక్రవారం) జరుగనున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను సీపీ ఇవాళ పరిశీలించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులను భారీగా మోహరించినట్లు సీపీ తెలిపారు. సభలు, విజయోత్సవాలు నిషేధమని, ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి ఎలాంటి ర్యాలీలకు అనుమతిచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.