: 88 ఏళ్ల తివారీ.. మళ్లీ పెళ్లి కొడుకాయనే
రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ 88 ఏళ్ల వయసులో పెళ్లికొడుకయ్యారు. ఒకప్పుడు ఉజ్వలా శర్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ద్వారా రోహిత్ శేఖర్ కు తండ్రి అయి ఎన్డీ తివారీ వార్తలకెక్కిన విషయం తెలిసిందే. తివారీ తన తండ్రి అంటూ రోహిత్ కోర్టుకు వెళ్లి మరీ నిరూపించుకున్నారు. దీంతో చేసేది లేక రోహిత్ తన కొడుకుగా అంగీకరించిన తివారీ, ఆయన తల్లి ఉజ్వలా శర్మను ఎట్టకేలకు లేటు వయసులో వివాహం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో వీరి వివాహం ఈ ఉదయం జరిగింది. తివారీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్నప్పుడు రాజ్ భవన్ లో యువతులతో రాసలీలలు సాగించి పదవి పోగొట్టుకున్న విషయం తెలిసిందే.