: కూతుళ్లపై అత్యాచారం... వీడియో చిత్రీకరణ
కన్నతండ్రి పదానికే కళంకం తెచ్చిన నిందితుడిని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన 46 ఏళ్ల వ్యక్తి, ఔరంగాబాద్ లో సొంత కూతుర్లపైనే నీచాతి నీచంగా అత్యాచారం సాగిస్తున్నాడు. వారు గర్భందాల్చగా.. బలవంతంగా తీసేయించాడు. పైగా తన నీచ పనిని వీడియోలుగా చిత్రీకరించి కంప్యూటర్లో భద్రపరిచాడు. దీన్ని తెలుసుకున్న అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఆ కామ మృగాన్ని కటకటాల వెనక్కి నెట్టేశారు.