: మంత్రాలయం సమీపంలో నలుగురి దారుణ హత్య
కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో నలుగురు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. రెండు రోజుల క్రితం వీరందరినీ అత్యంత పాశవికంగా రాళ్లతో కొట్టి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్యానంతరం నలుగురి మృతదేహాలను దుండగులు తుంగభద్ర నదిలో పడేశారు. హత్యకు గురైన వారిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం.