: వైఎస్సార్సీపీకి 18 ఎంపీ స్థానాలు: నీల్సన్ సర్వే
ఢిల్లీలో ఏబీపీ స్టార్ నీల్సన్ సంస్థ ఎన్నికల ఫలితాలపై సర్వే నిర్వహించింది. ఆ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 42 ఎంపీ స్థానాల్లో 18 లోక్ సభ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని తెలిపింది. టీడీపీకి 9 ఎంపీ స్థానాలు వస్తాయని, టీఆర్ఎస్ 8 స్థానాలు, కాంగ్రెస్, బీజేపీ చెరో 3 స్థానాలను గెలుచుకుంటాయని సర్వే తెలిపింది.