: కేసీఆర్ కోటలే బీటలు వారతాయి: డీకే అరుణ
స్థానిక సంస్థల్లో వచ్చిన ఫలితాలే శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రతిబింబిస్తాయని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ఫలితాలతో కేసీఆర్ కోటలే బీటలు వారతాయని... ఈ విషయం 16న తెలుస్తుందని చెప్పారు. ఎన్నికల సర్వేలతో కాంగ్రెస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారని... వారెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.