: హంగ్ వస్తే టీడీపీకే టీఆర్ఎస్ మద్దతివ్వాలి: పెద్దిరెడ్డి
టీడీపీ నేత పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హంగ్ వస్తే తెలుగుదేశం పార్టీకి టీఆర్ఎస్ మద్దతివ్వాలని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో... ఎన్డీఏ భాగస్వామి అయిన టీడీపీకి మద్దతిస్తేనే మేలు జరుగుతుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే వారయితే టీడీపీకి సపోర్ట్ చేయాలని సూచించారు. టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వచ్చినా ఏడాదికి మించి పరిపాలించలేదని జోస్యం చెప్పారు. 4 జడ్పీల్లో హంగ్ వచ్చినందున... స్థానిక అవగాహనల మేరకు ముందుకు సాగుతామని తెలిపారు.