: స్మార్ట్ ఫోనా? శృంగారమా?... యువతకు ఏది కావాలి?


స్మార్ట్ ఫోన్ కావాలా? శృంగారం కావాలా? అని యువతను అడిగితే ఓటు ఎటు వేస్తారు? అంటూ అమెరికాలో ఆరుబా నెట్ వర్క్స్ ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. యువతరం అభిరుచులు మారాయి. సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగిపోవడంతో విద్యార్థుల ప్రాధాన్యాలు కూడా మారిపోయాయి. అందుకే అమెరికా యువత శృంగారం కంటే స్మార్ట్ఫోన్ కే ఓటేశారు. స్మార్ట్ఫోన్ల కోసం దేనినైనా వదులుకుంటామని, చివరకు శృంగారం కూడా అక్కర్లేదని 26 శాతం అమెరికన్ టీనేజర్లు కుండ బద్దలుకొట్టి చెబుతున్నారు.

ఏది లేకున్నా పర్వాలేదు కానీ, శృంగారం లేకుండా ఉండలేమని చెప్పే యువత 20 శాతం మాత్రమే ఉందట. యువతరం రోజుకు ఐదు గంటలకు పైగా ఆన్లైన్లోనే గడుపుతూ, ఒకేసారి ఐదారు యాప్లు అవలీలగా వాడేస్తున్నారని సర్వే వెల్లడించింది. డిజిటల్ క్యాంపస్ తరగతుల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని కూడా సర్వే వెల్లడించింది. నోట్స్ రాసుకునేందుకు మొబైల్ వినియోగిస్తున్నట్టు 44 శాతం మంది విద్యార్థులు తెలిపారని హఫింగ్టన్ పోస్ట్ తెలిపింది.

  • Loading...

More Telugu News