: బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే ప్రసక్తే లేదు: నవీన్ పట్నాయక్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎలాంటి సహకారమూ అందించమని ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అన్నారు. ఎన్డీయేకు షరతులతో కూడిన మద్దతు ఇచ్చే విషయంపై ఆలోచిస్తున్నామన్న బీజేడీ నేత ప్రవాత్ త్రిపాఠి వ్యాఖ్యలపై భువనేశ్వర్ లో ఆయన మాట్లాడుతూ, ఇంతవరకు బీజేపీతో తాము ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. ఎన్డీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తి లేదని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. గతంలో ఎన్డీయేలో బీజేడీ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.