: సీమాంధ్ర జడ్పీటీసీ ఫలితాలివే
సీమాంధ్రలోని స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నవీన్ మిట్టల్ ప్రకటించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో మొత్తం 653 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా టీడీపీ 373 స్థానాల్లో విజయం సాధించగా, వైఎస్సార్సీపీ 275 స్థానాలను కైవసం చేసుకుందని తెలిపారు. కాంగ్రెస్ 2, ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారని చెప్పారు. మిగిలిన స్థానాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.