: వారంలో దేశం విడిచి వెళ్లిపోండి: పాక్ హుకుం
వారంలోపు దేశం విడిచి వెళ్లిపోవాలని భారత్ కు చెందిన ఇద్దరు పాత్రికేయులకు పాకిస్థాన్ హుకుం జారీ చేసింది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన స్నేహేష్ అలెక్స్ ఫిలిప్, ద హిందూ విలేకరి మీనామీనన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు వారికి లేఖలు అందాయి. వీసాలను పునరుద్ధరించలేదని, దేశం వీడి వెళ్లాలని వాటిల్లో ఉంది. భారత్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనున్న తరుణంలో పాకిస్థాన్ తీసుకున్న చర్య ప్రాధాన్యం సంతరించుకుంది.