: సుప్రీం న్యాయమూర్తులుగా నారిమన్, సుబ్రహ్మణ్యం?
ఇద్దరు సీనియర్ న్యాయవాదులైన రోహింగ్టన్ నారిమన్, గోపాల్ సుబ్రహ్మణ్యంలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన గతవారం సమావేశమైన కొలీజియం కమిటీ వీరిని న్యాయమూర్తులుగా ఎంపిక చేస్తూ కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత దానిపై రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారు. న్యాయవాదులను ఇలా సరాసరి సుప్రీం న్యాయమూర్తులుగా ఎంపిక చేయడం అరుదుగా జరుగుతుంటుంది.