: ఇదే నా చివరి ప్రెస్ మీట్ కావచ్చు: లగడపాటి


ఈ రోజు తన ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని... ఏ ఒక్క పార్టీ మీద ప్రేమో లేక ఏ ఒక్క పార్టీ మీద వ్యతిరేకతో లేదని చెప్పారు. తాను కేవలం ఇప్పుడు జరిగిన ఎన్నికలకు సంబంధించిన సర్వే ఫలితాలను మాత్రమే వెల్లడిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నానని... ఇదే తన చివరి ప్రెస్ మీట్ కూడా కావచ్చని తెలిపారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఫలితాలు రావడం బాధాకరంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మారిస్తే బాగుంటుందని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య మంచి సంబంధబాంధవ్యాలు కొనసాగాలని కోరారు.

  • Loading...

More Telugu News