: ఓల్డ్ సిటీ బయట కూడా సత్తా చాటిన ఎంఐఎం
ఇంతకాలం హైదరాబాదులోని ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైన ఎంఐఎం (మజ్లిస్)... ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన పరిధిని విస్తరించుకుంది. ముస్లింల ఆధిక్యత లేని ప్రాంతాల్లో కూడా హిందువులకు టికెట్లిచ్చి మంచి ఫలితాలను రాబట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్ శివార్లలో ఉన్న సరూర్ నగర్ మండలం బాలాపూర్ పరిధిలోని ఆరు ఎంపీటీసీలను గెలుచుకుని స్వీప్ చేసింది. అలాగే, కొత్తపేటలోని ఏడు ఎంపీటీసీలకు ఏడింటినీ గెలుచుకుంది. మొత్తం మీద రంగారెడ్డి జిల్లాలో (గ్రేటర్ హైదరాబాద్ పరిధి) 14 ఎంపీటీసీలను గెలుచుకుని తన ఉనికిని చాటుకుంది.