: మరో ఐదుగురికి రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరో ఐదుగురు దోషులకు క్షమాభిక్షను నిరాకరించారు. వారు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారని సమాచారం. ఇంకో ఇద్దరి మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులన్నింటినీ ప్రణబ్ పరిష్కరించినట్లయింది.
కేంద్ర హోంశాఖ సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మరే క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో లేదని తెలిపాయి. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన వారంతా తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారేనని చెప్పాయి.
హర్యానాకు చెందిన ధర్మపాల్ 1993లో బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా బాలిక కుటుంబ సభ్యులు ఐదుగురిని కిరాతకంగా హత్య చేశాడు. హర్యానా మాజీ ఎమ్మెల్యే కూతురైన సోనియా తన భర్తతో కలిసి 2001లో హిసార్ ప్రాంతంలో తల్లిదండ్రులు సహా తన కుటుంబ సభ్యులు 8మందిని హత్య చేశారు. ఉత్తరాఖండ్ కు చెందిన సుందర్ సింగ్, అత్యాచారం, హత్య కేసులో దోషిగా ఉన్నాడు.
ఇక 2002లో ఉత్తరప్రదేశ్ కు చెందిన జఫర్ అలీ తన భార్య, ఐదుగురు కూతుర్లను కర్కోటకంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన గుర్మీత్ సింగ్ 1986లో ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని దారుణంగా హత్య చేశాడు. 1994లో కర్ణాటకు చెందిన ప్రవీణ్ కుమార్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశాడు.
రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించిన వారిలో వీరందరూ వున్నట్టు సమాచారం.